విజయ్ తో నటించట్లేదు..!

I Am Not Acting Opposite Vijay In Any Of His Films Says Actress Rashmika Mandanna

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది ‘ఛలో’ భామ రష్మిక మందన. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరూ’, రీసెంట్ గా వచ్చిన ‘భీష్మ’ సినిమాలతోవరుస హిట్స్ తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే రష్మిక చేతిలో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక సుకుమార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా విభిన్నమైన యాస కూడా నేర్చుకుంటుంది. కన్నడలోనూ వరుస సినిమాలలో నటిస్తోంది. తమిళ్‌ లో కూడా కార్తికి జోడీగా ఓ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మురగదాస్-విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రష్మిక ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. నాకు కూడా విజయ్ తో స్క్రీన్ చేసుకోవాలని ఉంది. కానీ ప్రస్తుతం నేను విజయ్ సినిమాలో నటించట్లేదు అని తెలిపింది. మరి చూద్దాం ప్రస్తుతమైతే లేదు.. తొందరలోనే చేసే అవకాశం వస్తుందేమో. ఇక గతంలో ఎవరి పై క్రష్ ఉందనే ప్రశ్నకు రష్మిక తమిళ సూపర్ స్టార్ విజయ్ పై క్రష్ ఉందని.. చిన్న తనం నుంచీ విజయ్ పై క్రష్ ఉందని, ఆయనతో నటించడానికి ఆసక్తి ఉందని తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eight =