నితిన్ పెళ్లి విషయంలో మార్పు..!

Tollywood Actor Nithiin Thinks Of Changing His Marriage Plans

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో నితిన్ కూడా ఉంటాడు. అయితే ఈ ఏడాది ఆ లిస్ట్ నుండి బయటకి రాబోతున్నాడు. నితిన్ కు, షాలినితో వివాహం జరగబోతున్న సంగతి తెలసిందే. నితిన్, షాలినికి 2012లోనే పరిచయం ఏర్పడింది. స్నేహంతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగింది. పరిస్థితులు అన్ని బావుంటే ఏప్రిల్ 16నే వీరి వివాహానికి ముహూర్తం పెట్టారు. కానీ కరోనా వల్ల పెళ్లి వాయిదా పడింది. ఇక పరిస్థితులు చక్కబడిన తర్వాత ఏడాది చివరిలో చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడప్పుడే కరోనా ప్రభావం తగ్గే పరిస్థితి లేదు. రోజు రోజుకు కేసులు కూడా పెరిగిపోతున్నాయి. మరోపక్క పలువురు సెలబ్రిటీస్ మాత్రం సింపుల్ గా పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. వీటన్నిటి దృష్ట్యా నితిన్ పెళ్లి విషయంలో కుటుంబసభ్యులు ఓ నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే వీలైనంత త్వరగానే నితిన్ పెళ్లి చేయాలని అనుకుంటున్నారట. హైదరాబాద్ లోని తమ ఫామ్ హౌస్ లో వచ్చే నెలలో నితిన్ పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పెళ్లి తరువాత నితిన్ షూటింగ్ లకు వెళ్లాలని చూస్తున్నాడట. చూద్దాం ఏం జరుగుతుందో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఈ మధ్యే నిఖిల్ పెళ్లి చేసుకోగా.. రానా పెళ్లి ఆగష్ట్ లో జరగనుంది. ఇక సాహూ డైరెక్టర్ సుజీత్ ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. మెగా డాటర్ నిహారిక పెళ్లి పై కూడా క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది పెళ్లి జరిగే అవకాశం ఉంది.

ఇక భీష్మ సినిమాతో నితిన్ వరుసగా ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టేసాడు. చంద్రశేఖర్ యేలేటి, ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతో పవర్ పెటా రీమేక్ అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ చేస్తున్నాడు నితిన్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + seventeen =