టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. డిసెంబర్ లో పెళ్లి అనుకున్నారు.. కానీ ఆగష్ట్ 8 వ తేదీన పెళ్లి డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో రానా – మిహీకా ల పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయట. ముందు వీరి పెళ్లి రామానాయుడు స్టూడియోస్ లో చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఇరు కుటుంబసభ్యులు మాట్లాడుకొని ఫైనల్ మరో వేదికను నిర్ణయించుకున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వైభవంగా నిర్వహించబోతున్నారట. అంతేకాదు మిహికా బజాజ్ ఇప్పటికే పెద్ద పెద్ద వివాహ వేడుకలకు వెడ్డింగ్ ప్లానర్ గా వ్యవహరించారు. దీంతో వీరి వెడ్డింగ్ కి కూడా రాయల్ థీమ్ తో సన్నాహాలను చేస్తోందట. కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు.. చాలా ముఖ్యమైన వారిని మాత్రమే పెళ్ళికి పిలవనున్నారట. ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ ని అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకొని వివాహం జరిపించనున్నారు.
ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: