నితిన్ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్..!

Hollywood Make Up Artist Roped In For Nithiin Upcoming Movie With Director Krishna Chaitanya

చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ‘భీష్మ’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు నితిన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టేసాడు. చంద్రశేఖర్ యేలేటి, ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతో అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ చేస్తున్నాడు నితిన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీటిలో కృష్ణ చైతన్యతో చేస్తున్న సినిమా ‘పవర్ పేట’. ఈ సినిమా ప్రకటించి కూడా చాలా కాలమే అవుతుంది. గత రెండు సంవత్సరాలుగా ‘పవర్ పేట’ స్క్రిప్ట్ పైనే కృష్ణ చైతన్య వర్క్ చేస్తున్నాడు. ఇక సినిమాలో నితిన్ మూడు విభిన్నమైన వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడట. 20 ఏళ్ల కుర్రాడిగా 40 ఏళ్ల మద్య వయస్కుడిగా 60 ఏళ్ల వృద్దుడిగా నితిన్ కనిపించనున్నాడట. అందుకే ఈ సినిమాకు ఈ గెటప్సే కీలకం కాబట్టి దీని కోసం ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టును తీసుకోనున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం రంగ్ దే, అంధాదున్ సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ‘రంగ్ దే’ షూట్‌ని… జూన్, జూలై అంతా చూశాక.. పరిస్థితులను అంచనా వేసి ఆగస్ట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేయాలనే నిర్ణయించుకున్నాడట. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యేప్పటికి పవర్ పేట ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా దర్శకుడు కృష్ణ చైతన్య పూర్తి చేసేసి…వచ్చే ఏడాదికి ఈ పవర్ పేట చిత్రాన్ని పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారట. మరి వచ్చే ఏడాది అంటే పరిస్థితులు కాస్త అనుకూలంగానే ఉంటాయి. అప్పుడే విదేశాల్లో షూటింగ్స్.. అక్కడివాళ్లు ఇక్కడి రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + thirteen =