12 ఏళ్ల ‘రెడీ’ – ఎప్పుడూ స్పెషలే

Ram Pothineni tweets on the occasion of 12 years of ready

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా 2008లో వచ్చిన రెడీ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో కామెడీలోనే కొత్త ఒరవడి తీసుకొచ్చాడు శ్రీను వైట్ల. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీనికి తోడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ. ఆడియో కూడా సూపర్ హిట్. ఇప్పటికే రెడీ సినిమాలో సాంగ్స్ వినే వారు వుంటారు. అటు రామ్ కు, జెనిలీయాకు ఇటు డైరెక్టర్ శ్రీనువైట్లకు కూడా ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్. ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రామ్ సోషల్ మీడియా ద్వారా అప్పటి రోజులను మరోసారి గుర్తుచేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘స్రవంతి మూవీస్ లో నా మొదటి సినిమా.. టీనేజర్ గా నా లాస్ట్ సినిమా.. ఈ సినిమాతో నా బెస్టీ జెనీలియాను కలిశాను.. శ్రీను వైట్ల గారినుండి చాలా నేర్చుకున్నాను.. దేవి మ్యూజిక్ మ్యాజిక్.. కోన వెంకట్, గోపి మోహన్, బ్రహ్మీ గారి నుండి చిట్టి నాయుడు వరకు బ్రిలియంట్ టీం.. అందరి కాంబినేషన్ వచ్చిన రెడీ 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమా నాకు ఎప్పుడూ స్పెషలే అని ట్వీట్ లో పేర్కొన్నాడు.

 


కాగా ప్రస్తుతం రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాకు రీమేక్ ఈ సినిమా. ఇక ఈ సినిమాలో మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకరు దొంగ మరొకరు కాంట్రాక్టర్ అని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఇక నివేదా పేతురేజ్, మాళవిక శర్మ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను… స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అవ్వగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వాళ్ళ సినిమా రిలీజ్ లేట్ అయింది. అయితే లేట్ అయినా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =