ఖైదీ సీక్వెల్ కు సిద్ధమవుతున్న కార్తీ – లోకేష్..!

Khaidi Movie Sequel On Cards

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అవ్వనుంది. అజ‌య్ దేవ‌గ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించనున్నాడు. కన్నడలో కూడా ఈ సినిమా రీమేక్ కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. క‌న్న‌డ రీమేక్ వెర్ష‌న్ లో శాండిల్ వుడ్ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కార్తీ ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం లోకేష్ విజయ్ మాస్టర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ అయితే అయిపోయిందనుకోండి. రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో `అన్నాత్తే` చిత్రం రూపొందిస్తున్నాడు. మరోవైపు కార్తీ మణిరత్నం రూపొందించబోయే `పొన్నియన్ సెల్వమ్` సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత `ఖైదీ` సీక్వెల్‌ను కార్తీ పట్టాలెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఎంత తొందరగా సీక్వెల్ ను మొదలుపెడితే అంత బెటర్ అని ఆలోచిస్తున్నారట. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.