ఆమె బయోపిక్ లో నటించాలని ఉంది..!

RX 100 Fame Actress Payal Rajput Wants To Reprise Sridevi In Her Biopic

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. ఇక ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ట చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది ‘వెంకీమామ’ సినిమాతో అలరించిన పాయల్.. ఈ ఏడాది రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రనదీప్ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘5ws’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె ఐపీఎస్ రోల్ లో ఆమె నటిస్తుంది.

ఇక ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంట్లో ఉన్న పాయల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం అందుబాటులోనే ఉంటుంది. వారితో చిట్ చాట్ కూడా చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఒక అభిమాని మీకు ఏదైనా బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే.. ఏ బయోపిక్ లో నటిస్తారని అడుగగా.. అందుకు పాయల్ శ్రీదేవి గారి బయోపిక్ లో నటించాలని సమాధానం ఇచ్చింది. ఆమె బయోపిక్ కనుక తీస్తే.. శ్రీదేవి గారి పాత్రలోనటించాలని ఉందని తెలిపింది. మరి చూద్దాం ఎవరైనా తీస్తే పాయల్ కు ఛాన్స్ ఇస్తారేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =