నాక్కూడా విసుగ్గా ఉంది… బోర్ కొడుతోంది..!

Message from Megastar Chiranjeevi To Daily Wage Cine Workers

లాక్ డౌన్ వల్ల ప్రభుత్వాలు సడలింపులు చేయగా కొంతమంది తమ పనులకు వెళ్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీకి మాత్రం ఇంకా మంచి రోజులు రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా.. అన్ని నిబంధనలతో షూట్ చేయడానికి పెద్దగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ధైర్యం చేసి రాజమౌళి ట్రయిల్ షూట్ చేద్దామని రంగంలోకి దిగాడు కానీ.. రాజమౌళి చేతులెత్తేసినట్టు వార్తలు వచ్చాయి ఇప్పటికే. దీనితో జులై ఎండింగ్ వరకూ ఆగాల్సిందే. అయితే దీనివల్ల సినీ కార్మికులకు మాత్రం ఇబ్బందే అని చెప్పొచ్చు. షూటింగ్ లు మొదలైతే కాస్త కోలుకోవచ్చని అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇక ఈ నేపద్యంలో సినీ కార్మికులకు సీసీసీ అండ‌గా ఉంటుందని చెపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే చిరు కరోనా వైరస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరించి సినీ కార్మికులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందచేశారు. ఇక ఇప్పుడు మరోసారి నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను తిరిగి పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను తిరిగి పంపిణీ చేయాల్సిన ప‌రిస్థితులున్నాయి. ఇంకా షూటింగులు మొద‌లుకాలేదు. అందువ‌ల్ల‌ ఎవ‌రికీ ప‌నిలేదు. అందుకే అంద‌రికీ నిత్యావ‌స‌ర స‌రుకులు ఇవ్వాల‌ని సీసీసీ క‌మిటీలో నిర్ణ‌యించాం. ఇదివ‌ర‌కూ అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఎవ‌రూ బ‌య‌ట‌కు రాలేదు కాబ‌ట్టి, సీసీసీ వాలంటీర్ల ద్వారా ఇళ్ల‌కే వ‌స్తువుల‌ను పంపిణీ చేశాం. క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. నేను స్వ‌యంగా టెస్ట్ చేశాను. నాక్కూడా ప‌ని లేక విసుగ్గా ఉంది. బోర్ కొడుతోంది. అంద‌రి ప‌రిస్థితిని అర్థం చేసుకోగ‌ల‌ను. అంద‌రూ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోండి. ప‌ని ముఖ్య‌మే. ప్రాణం అంత‌క‌న్నా ముఖ్యం. పెద్ద‌ల‌ను, చిన్న పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోండి. ఎవ‌రూ అధైర్య‌ప‌డ‌వ‌ద్దు. మ‌ళ్లీ అంద‌రం చేతినిండా ప‌నితో ఉంటాం. ఎప్పుడూ కార్మికుల‌కు సీసీసీ అండ‌గా ఉంటుంది’’ అని తెలిపారు.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.