కింగ్ నాగార్జున కు జోడీగా ఇలియానా ?

Ileana To Act Alongside King Akkineni Nagarjuna In A Bollywood Remake Movie

కింగ్ నాగార్జున ప్రస్తుతం నూతన దర్శకుడు సోలోమెన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున ఇప్పుడు రెండు సినిమాలను లైన్ లో పెట్టారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్ని నాయనా ” మూవీ సీక్వెల్ “బంగార్రాజు”, మరొకటి సక్సెస్ ఫుల్ “గరుడవేగ” మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందే మూవీ. అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ “రైడ్ ” బాలీవుడ్ మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందనుంది. “రైడ్ ” బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా నటించిన ఇలియానా ను తెలుగు వెర్షన్ కు కూడా ఎంపిక చేయాలని ప్లాన్ చేసి ఆమె తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా “పోకిరి “, “జల్సా “, “కిక్ “, “జులాయి ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సక్సెస్ ఫుల్ “బర్ఫీ ” మూవీతో బాలీవుడ్ లో ప్రవేశించి పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. టాలీవుడ్ కు దూరమైన ఇలియానా 6సంవత్సరాల తరువాత నటించిన “అమర్ అక్బర్ ఆంథోనీ “మూవీ నిరాశ పరిచింది. ఇలియానా ప్రస్తుతం “ది బిగ్ బుల్ “హిందీ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. “రైడ్ ” బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా నటించిన ఇలియానా కు తెలుగు మూవీ లో కూడా హీరోయిన్ గా అవకాశం రావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =