‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘అభినేత్రి’ 2 లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రాబోతుంది. ప్రస్తుతం నందిత ‘ఐపీసీ 376’ అనే సినిమాలో నటిస్తుంది. రామ్ కుమార్ సుబ్బరాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాకర్ నిర్మిస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ ట్రైలర్ ను బట్టి చూస్తే పోలీస్ అధికారి పాత్రలో నందిత శ్వేత సూపర్ గా నటించిందని తెలుస్తుంది. అమ్మాయిలను బతకనివ్వరా అంటూ నందిత శ్వేతా చెప్పిన ఎమోషనల్ పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావలి కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో నందిత శ్వేత కాలేజ్ లెక్చరర్ గా నటిస్తుంది. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: