బాడీ షేమింగ్ పై నిత్యా సీరియస్.. మన గురించి వాళ్ళకే ఆలోచన ఎక్కువ..!

Versatile Actress Nithya Menen Slams Perpetrators On Social Media Against Body Shaming Rumors

సెలక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకునే వారిలో యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఎప్పుడూ ముందుంటది. విభిన్న పాత్రలు చేయడంలో నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటారు. చాలా సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటూ.. ప్రతి కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటారు. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు..ఎంత మంచి రోల్ చేశామన్నది ఆమె సిద్దాంతం. తెలుగు, తమిళ, మల‌యాళ, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఏ విషయాన్నైనా నిత్యా భయపడకుండా మాట్లాడుతుంది. తనపై కామెంట్స్ వేసే వారికి అయితే కాస్త గట్టిగానే కాంటర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో తన శరీర బరువు గురించి విమర్శలు చేస్తున్న వారికి హీరోయిన్ నిత్యా మీనన్ ఘాటు రిప్లై ఇచ్చింది. అవును.. వాళ్ళకి పని లేక మనమీద కామెంట్స్ చేసుకుంటూ వుంటారు.. నేనే కాదు చాలా మంది బాడీ షేమింగ్‌కు గురై ఉంటారు. మన శరీర బరువు గురించి మన కంటే వారే ఎక్కువ ఆలోచిస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయంటారు. రకరకాల విశ్లేషణలు చేస్తారు. అయితే అవన్నీ చాలా చిన్నవి. నా వ్యక్తిగత విషయాల గురించి బయట మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. సినీ పరిశ్రమ వారు నన్ను చూస్తున్నారా? లేక నా బరువును చూస్తున్నారా? విషయాన్ని పట్టించుకోవడం మానేశాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. అదే నా గురించి మాట్లాడుతుంద`ని నిత్య చెప్పింది. అంటూ కౌంటర్ ఇచ్చింది.

కాగా నే త్వరలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీతో రానుంది నిత్యా. ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్ ఇదివరకెన్నడూ పోషించని పాత్రలో కనిపిస్తుందని టాక్. కరోనా వల్ల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ సినిమాను నాలుగు భాషలు తెలుగు, తమిళ, మల‌యాళ, కన్నడతో పాటు హిందీలోనూ ఏకకాలంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 9 =