చిరు సినిమాలో జగ్గూభాయ్..?

Versatile Tollywood Actor Jagapathi Babu To Play A Pivotal Role In Mega Star Chiranjeevi Upcoming Movie

సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ నిలిచాడు. ప్రస్తుతం అటు సీనియర్ హీరోల సినిమాల నుంచి, ఇటు యంగ్ హీరోల సినిమాల వరకూ అందరితో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. కేవ‌లం విల‌న్ పాత్ర‌లోనే కాక స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ కూడా చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. తెలుగు, త‌మిళం,మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో న‌టిస్తున్నాడు జగ్గూభాయ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో అవకాశం జగపతి బాబు ను వరించినట్టు తెలుస్తుంది.మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ‘సాహో’ ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఏ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం జగపతిబాబుని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ పాత్రకు జగపతి బాబు అయితేనే కరెక్ట్ గా సరిపోతాడని అనుకుంటున్నారట. మరి చుద్దాం ఫైనల్ గా ఏమవుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =