హార్రర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. ఒకప్పుడు ‘రాత్రి’ ‘భూత్’ సినిమాలతో ఆడియన్స్ ని భయపెట్టాడు. ఇక ఈ మధ్య కాలంలో వర్మ హార్రర్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. వర్మ నుండి హార్రర్ సినిమా వచ్చి చాలా ఏళ్ళే అయింది. ఇప్ప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి హార్రర్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా ”12 O క్లాక్” అనే హారర్ మూవీని తీస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ రోజు సాయంత్రం 7 గంటలకి 12 ‘O’ క్లాక్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించనున్నారు.
Horror works more on a psychological level in using the audience’s own imagination to scare themselves ..I used this technique in RAAT , BHOOT and now in 12 ‘o’ CLOCK pic.twitter.com/Mn6aVKGnOz
— Ram Gopal Varma (@RGVzoomin) July 3, 2020
కాగా వర్మ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే అరడజను పైగా సినిమాలు ప్రకటించాడు. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. సడన్ గా సినిమా పోస్టరో.. టీజరో రిలీజ్ చేసి అందరికీ షాకిస్తాడు. మియా మాల్కోవాతో ”క్లైమాక్స్” రూపంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అక్కడితో ఆగకుండా.. ఇటీవల ‘నగ్నం’ సినిమాని ప్రేక్షకుల మీదకి వదిలారు. వీటితో పాటు ‘కరోనా’ ‘మర్డర్’ ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ ‘ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ’ సినిమాలను కూడా ప్రకటించారు రాంగోపాల్ వర్మ.




మరి ఇన్ని సినిమాల్లో ఎన్ని సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకుంటాయో.. ఎన్ని సినిమాలు రిలీజ్ కు నోచుకుంటాయో… తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.