రకుల్ ప్రీత్ హ్యాపీ ఫీలింగ్స్

Actress Rakul Preet Singh Shares Her Happiness As She Completes 10 Years Of Her Film Career Shortly

“కెరటం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ హోదా ను అందుకున్నారు. రకుల్ నటించిన “దే దే ప్యార్ దే “, “మర్జావాన్” హిందీ మూవీస్ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో బిజీగా మారారు. రకుల్ ప్రస్తుతం 2హిందీ , 2 తమిళ , ఒక తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ లో ఇంటికి పరిమితం అయిన రకుల్ షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ముంబై లో త్వరలోనే ప్రారంభం కానున్న హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.

త్వరలోనే 10 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి కానున్న సందర్భం లో రకుల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రకుల్ మాట్లాడుతూ .. ఎటువంటి సినీ నేపథ్యం లేని తాను తనపై ఉన్న నమ్మకం తో చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టానని, వచ్చిన అవకాశాలు నిలబెట్టుకుని ఈ స్థాయి కి చేరుకున్నానని, ఇప్పుడు తీరిక లేని సినీ కెరీర్ ను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నానని, భగవంతుని ఆశీర్వాదం , ప్రేక్షక , అభిమానుల ఆదరాభిమానాలతో 10 సంవత్సరాల సినీ జర్నీ కి చేరువ కానున్నానని, ఇది ఒక కలలా అనిపిస్తుందని , ప్రేక్షకుల మది లో గుర్తుండిపోయేలా మరిన్ని గొప్ప పాత్రలలో నటించాలని ఉందని , తాను నటించే ప్రతి మూవీ ని తన తొలి చిత్రం అనుకొని కష్టపడుతుంటానని రకుల్ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here