నిహారిక ఎంగేజ్ మెంట్ డేట్ అప్పుడే..?

Mega Family Announce A Tentative Date For Niharika Chaitanya Engagement Ceremony

మెగా కాంపౌండ్ లో కూడా త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిహారికకు కాబోయే వరుడిని అందరికీ పరిచయం చేశారు. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఓ పోలీస్ అధికారి కొడుకు చైతన్య. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి నిశ్చితార్దానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆగ‌స్ట్ 13న చైతన్య, నిహారిక ల నిశ్చితార్థం జ‌రిగే అవ‌కాశం ఉందని అంటున్నారు. ఆగ‌స్టులో ఎంగెజ్మెంట్, వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మెగా బ్రదర్ నాగబాబు నిహారిక పెళ్లి పై ఇటీవలే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఘనంగా పెళ్లి చేయడం కుదరకపోవచ్చని, ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూనే పెళ్లి చేయాల్సి వస్తుందని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే ఏదో హడావుడిగా, ఆర్భాటంగా చేసేయాల‌నుకోవ‌డం లేద‌ని తెలిపారు.

ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తుంది నిహారిక. గతంలో ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక కొణిదెల. ఇప్పుడు తాజాగా ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది. పూర్తి స్థాయి కామెడీతో ఈ సినిమా తెరకెక్కబోతునన్నట్టు తెలుస్తుంది. పెళ్ళికి ముందే ఈ సినిమా పూర్తి చేయాలని చూస్తుంది నిహారిక.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eighteen =