పవన్ కళ్యాణ్ కు జోడీగా తమన్నా ?

Actress Tamannaah To Play A Pivotal Role Opposite Pawan Kalyan In Vakeel Saab Movie

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కోర్ట్ రూమ్ డ్రామా గా “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా దిల్ రాజు నిర్మిస్తున్న”వకీల్ సాబ్ ” మూవీ కి బోనీ కపూర్ సహనిర్మాత. అంజలి , నివేత థామస్, అనసూయ , అనన్య నాగళ్ళ , ప్రకాష్ రాజ్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వకీల్ సాబ్ ” మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ ఎంపిక అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు హీరోయిన్ గా తమన్నా ఎంపిక అయినట్టు సమాచారం . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , తమన్నా జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ “కెమెరా మెన్ గంగతో రాంబాబు ” మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన తమన్నా బెస్ట్ హీరోయిన్ గా TSR – TV 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. “వకీల్ సాబ్ ” మూవీలో హీరోయిన్ గా తమన్నా ఎంపిక అయిన వార్త నిజం అయితే తమన్నా , పవన్ కళ్యాణ్ తో మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 10 =