ఆ సినిమాను.. వర్మ ను ఎప్పటికీ మరచిపోను..!

I Will Be Always Indebted To RGV and To Satya Movie Says Tollywood Ace Writer Kona Venkat

మొదటి సినిమాను.. రామ్ గోపాల్ వర్మను ఎప్పటికీ మర్చిపోను అంటున్నాడు కోన వెంకట్. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా..? రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘సత్య’ సినిమా. జె.డి చక్రవర్తి, మనోజ్ బాజ్ పాయ్, ఊర్మిళ, శురభ్ శుక్లా ప్రధాన పాత్రల్లో వచ్చిన సత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. 1998 జులై 3 న వచ్చిన ఈ సినిమా నేటితో 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కోన వెంకట్ తన ట్విట్టర్ ఈ సినిమాను, వర్మను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. అవకాశం అనేది దేవుడితో సమానం.. అవకాశం ఇచ్చిన వాళ్ళు దేవునికంటే ఎక్కువ.. నాకు అలాంటి అవకాశం ఇచ్చిన వర్మకు, సత్య సినిమాకు నేను ఎప్పుడు కృతజ్ఞుడినే అంటూ పేర్కొన్నాడు.

కాగా ఇన్నేళ్లు రచయిత గా ఎన్నో సినిమాలకు పని చేసిన కోన ఇప్పుడు నిర్మాతగా కూడా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘నిశ్శబ్దం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇంకా మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్స్‌ మెడల్ సాధించిన కరణం మల్లేశ్వరి జీవితకథ ఆధారంగా సంజనా రెడ్డి దర్వకత్వంలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈసినిమాను ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డైలాగులు కోన వెంకటే రాస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here