కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 162

షూటింగ్ అప్‌డేట్

'బొమ్మ మొదలైంది' to 'బొమ్మ దద్దరిల్లిపోయింది'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సుధీర్ బాబు స్వీట్ మెమొరీ

ఆంధ్ర ప్రదేశ్ లో నెంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా నిలిచిన సుధీర్ బాబు , బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో డబుల్స్ పార్టనర్ గా వ్యవహరించారు. సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో నటుడిగా టాలీవుడ్ లో ప్రవేశించిన సుధీర్ బాబు "శివ మనసు లో శృతి " మూవీ తో హీరోగా మారారు. "ప్రేమ కథా చిత్రమ్ ", "సమ్మోహనం ", "నన్ను దోచుకుందువటే " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "బాఘీ" మూవీ తో సుధీర్ బాబు ప్రతినాయకుడిగా బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'నారప్ప' నుండి వెంకీ పెద్ద కొడుకు లుక్ రిలీజ్..!

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన 'అసురన్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో 'నారప్పగా' ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా... తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Tollywood Crazy Hero Vijay Deverakonda Gets Busy In Interior Design Work Of His New Home In Hyderabad
సినిమా వార్తలు

లాక్ డౌన్ సమయం లో బిజీ గా విజయ్ దేవరకొండ

"పెళ్ళి చూపులు ", "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడి విజయ్ పై క్రేజ్ పెరిగింది. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'బాహుబలి' కంటే 'ఆర్ఆర్ఆర్' పది రేట్లు గూజ్ బంప్స్..!

ఆర్ఆర్ఆర్ ఈ సినిమా కోసం తెలుగు సినీ ప్రేక్షకులే కాదు దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఇక ఒక్కోసారి మనం ఎంత ఎదురు చూస్తామో అంత లేట్ అవుతుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా పేరు వింటూనే వున్నాం. రాజమౌళి సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పేదేముంది. టైం కాస్త ఎక్కువ తీసుకున్నా పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇస్తాడు. అందుకే కాస్త లేట్ అయినా కూడా అభిమానులు ఎదురుచూస్తుంటారు. ముందు ఈఏడాది జులై 30 న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కుదరకపోవడంతో 2021 జనవరి లో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక ఇప్పుడు కూడా రిలీజ్ డేట్ కష్టమే. కరోనా వల్ల పరిస్థితులు మొత్తం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సమంత ఇన్ స్టా గ్రామ్ ఫోటో స్టోరీ

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొసాగుతున్నారు. "ఓ బేబీ " ఘనవిజయం తరువాత కథానాయిక కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సమంత ఎంపిక చేసుకుంటున్నారు. సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రతీకారం కోరుకుంటే ఎదుగుదల ఉండదు..!

రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా వుండడన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఫేస్‌బుక్‌లో మాత్రమే ఉండేది. అది కూడా ఏదో నామ మాత్రం అన్నట్టుగానే ఉండేవాడు. ఇక ఇటీవలే ట్విట్ట‌ర్లోకి అడుగు పెట్టాడు. ట్విట్టర్ కూడా అదే పరిస్థితి. చాలా రేర్ గా అప్ డేట్స్ ఇస్తుంటాడు. అయితే చరణ్ తాజాగా చేసిన ట్వీట్ మాత్రం వైరల్ అవ్వడమే కాకుండా ఆలోచింపచేస్తుంది. ఇంతకీ చరణ్ పెట్టిన ట్వీట్ ఏంటంటే.. ‘‘హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు.’’ అని రామ్ చరణ్ ట్వీట్ చేసి ఆయన నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలోని ఓ స్టిల్‌ను, మరో క్లోజప్ స్టిల్‌ను పోస్ట్ చేశారు…

TFN Adminవాట్సాప్
సాంగ్

ఈ రూమర్స్ ఎలా వస్తాయో అర్థంకావట్లేదు..!

మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. ఇక ఈ సినిమా తర్వాత "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. ఒక మంచి హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది ఈ భామ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్క్రిప్ట్ లో ఆ రెండు పాయింట్స్ కచ్చితంగా చూసుకుంటా..!

అతి తక్కువ టైంలోనే రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఏదిగింది. అయితే ఆ రేంజ్ కు ఎదగాలంటే కేవలం లక్ ఒక్కటే వుంటే సరిపోదు కదా. ఏ కథను ఎంచుకుంటున్నారు.. వాారి కథకు ఎంత ప్రాధాన్యత వుంది అనే విషయాలు కూడా చూసుకోవాలి. ఏదో నాలుగు సీన్స్, నాలుగు పాటలు ఉన్నాయా అని చూసుకుంటే సరిపోదు కదా. అలా చూసుకుంటే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగడం కష్టం. ఆ విషయంలో రష్మిక మాత్రం డిఫరెంట్ అనే చెప్పొచ్చు. మొదటి సినిమా నుండి తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ కథలను ఎంపిక చేసుకోవడం వల్లే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉంది. ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ ఏ సినిమాకి ఆ సినిమాలో తన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గల్వాన్ వ్యాలీ నేపథ్యంలో బాలీవుడ్ మూవీ

భారత్ , చైనాల సరిహద్దు గల్వాన్ వ్యాలీ లో ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. అక్కడ జరిగిన ఘర్షణ లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. చైనాకు వ్యతిరేక పోరాటంలో ప్రధాని మోదీ 59 చైనా యాప్ లను నిషేధించారు. చైనా వస్తువులను బహిష్కరించమని ప్రజలకు పిలుపునిచ్చారు. గల్వాన్ వ్యాలీ నేపథ్యంలో మలయాళ భాష లో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ బాలీవుడ్ లో రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సాంగ్

ఎన్టీఆర్ సాంగ్ కు జపనీస్ జంట డ్యాన్స్ అదుర్స్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అశోక్ " మూవీ 2006 సంవత్సరంలో రిలీజ్ అయ్యి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. సమీరారెడ్డి కథానాయిక. మణిశర్మ సంగీతం అందించారు. ఎన్టీఆర్ , సమీరా రెడ్డి సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అనుకున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"12'O Clock" మూవీ టీజర్ రిలీజ్

దెయ్యం , భూత్ , డర్నా మనా హై , డర్నాజరూరీ హై , అగ్యాత్ , భూత్ రిటర్న్స్ , ఐస్ క్రీమ్ వంటి హారర్ మూవీస్ తో ప్రేక్షకులను భయపెట్టిన రామ్ గోపాల్ వర్మ మరో హారర్ మూవీతో ప్రేక్షకులముందుకు వస్తున్నారు. కరోనా టైమ్ లో కూడా వర్మ డేరింగ్ గా షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ రూపొందిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. కరోనా మహమ్మారి పై రూపొందిందించిన "కరోనా వైరస్ "మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరో మూవీ లో సంగీత దర్శకుడు

"బంపర్ ఆఫర్ ", "అహ నా పెళ్ళంట ", "దేవుడు చేసిన మనుషులు ", "దొంగాట ", "పలాస 1978 " వంటి మూవీస్ కు సంగీత దర్శకుడిగా పని చేసిన రఘు కుంచె "పలాస 1978 " మూవీ లో నటుడిగా గుర్తింపు పొందారు. యాక్టర్ ,సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ , మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇప్పుడు మరో మూవీ కి నటుడిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నెపోటిజంపై తాప్సీ స్పందన

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పాత్ర కు ప్రాధాన్యం ఉండే మూవీస్ ను తాప్సీ ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం "హసీన్ దిల్ రుబా ", క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ "శభాష్ మిథు " హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. జనగణమన {తమిళ ) మూవీ లో కూడా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లాక్ డౌన్ సమయం లో రామ్ చరణ్

మూవీ షూటింగ్స్ , ఓపెనింగ్స్ , ప్రమోషన్స్ , ఫొటో షూట్స్ తో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి మూడు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. తమ తమ వ్యాపకాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. షూటింగ్స్ కు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినా స్టార్ హీరో , హీరోయిన్స్ షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి కనపరచడం లేదు.

Team TFNవాట్సాప్
సాంగ్

"ఇండియన్ 2" మూవీ లో పాయల్ స్పెషల్ సాంగ్ ?

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా "ఇండియన్ 2" తమిళ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "ఇండియన్ "(భారతీయుడు ") మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ కథానాయికలు. సిద్ధార్ధ్ , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Tollywood Actor Manchu Manoj To Play Antagonist Role In NTR 30 Movie
సినిమా వార్తలు

"#NTR30" మూవీలో విలన్ గా మనోజ్ మంచు ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో కొమరం భీం గా నటిస్తున్నారు." RRR" మూవీ తరువాత ఎన్టీఆర్ "#NTR30" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "#NTR30" మూవీ తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులకు మహేష్ బాబు థ్యాంక్స్

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం ప్రారంభంలోనే "సరిలేరు నీకెవ్వరు " వంటి బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్స్ తో మహేష్ బాబు రికార్డ్స్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు మహేష్ బాబు , అభిమానులకు అనేక జాగ్రత్తలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఆ వార్తల్లో నిజం లేదు - ఆర్ జి వి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా కాలంలో కూడా షార్ట్ ఫిల్మ్స్ , మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. " క్లైమాక్స్ ", "నేకెడ్ " వంటి ఫిల్మ్స్ ను ప్రత్యేకమైన యాప్ తో "పే ఫర్ వ్యూ " విధానంలో ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. కరోనా మహమ్మారి పై "కరోనా వైరస్ " పేరుతో ఒక మూవీ ని రూపొందించారు. "పవర్ స్టార్ " టైటిల్ తో ఒక మూవీ ని తెరకెక్కిస్తున్నారు. "12 "o " క్లాక్ " టైటిల్ తో ఒక హారర్ మూవీ ని వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

''12 O క్లాక్'' ట్రైలర్ రిలీజ్..!

కరోనా రాకముందు కూడా వర్మ ఇంత స్పీడ్ గా సినిమాలు చేసింది లేదు. ఒకపక్క అందరూ షూటింగ్ లు తీయాలన్నా.. షూటింగ్ లకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తూ అందరికీ షాకులిస్తున్నాడు. ఇప్పటికే ''క్లైమాక్స్'', 'నేకెడ్', 'మర్డర్', 'కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్', 'ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ' సినిమాలు లైన్ లో ఉండగా ఈ రోజు ''12 O క్లాక్'' అనే హారర్ మూవీని తీస్తున్నట్టు ప్రకటించాడు. అంతేనా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడైందో తెలియదు కానీ అప్పుడే ట్రయిలర్ కూడా రిలీజ్ చేసాడు.

TFN Adminవాట్సాప్

షేర్