నెపోటిజమ్… సినీ పరిశ్రమలో ఎప్పటినుండో వున్నదే అయినా రీసెంట్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్ బయటకి వచ్చి తమకు ఎదురైన ఇబ్బందులు కూడా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా నేపోటిజమ్ పై తమన్నా కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నా తమన్నా… `మా కుటుంబంలో అందరూ డాక్టర్లే. ఒకవేళ నేను కూడా డాక్టర్ నే అవ్వాలనుకుంటే.. నా తండ్రి లేదా సోదరుడు నన్ను గైడ్ చేసి ఉండేవారు. ఇప్పుడు నేను హీరోయిన్ గా చేస్తున్నా.. ఫ్యూచర్ లో నా పిల్లలు సినీ పరిశ్రమలోకి వస్తానంటే నేనూ వాళ్లకు మద్దతుగా ఉంటాను. అందులో తప్పేమీ లేదు. తమిళ, తెలుగు సినిమాలు చేయడం ప్రారంభించినపుడు నాకు అక్కడి భాష తెలియదు. అక్కడి వారెవరితోనూ పరిచయం లేదు. అయినా నాకు వరుస అవకాశాలు వచ్చాయి. నా కష్టాన్ని, ప్రతిభను చూసిన వారు నాకు అవకాశాలు ఇచ్చారు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది నా సినిమాలను బట్టి ఉంటది.. ఇక బంధుప్రీతి, రాజకీయాలు అనేవి ప్రతీ రంగంలోనూ కామన్‌గా ఉంటాయి. ఒకరి సక్సెస్ ను మరొకరు ఆపలేరు అంటూ తమన్నా వ్యాఖ్యానించింది.
కాగా ప్రస్తుతం తమన్నా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ నటిస్తుంది. ఈ సినిమాలో కబడ్డీ కోచ్ గా కనిపించనుంది. దీనితో పాటు మరో రెండు బాలీవుడ్ మూవీస్ లో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























