లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి..!

Legendary choreographer Saroj Khan is no more

ఇంతకుముందే చెప్పుకున్నాం 2020 సినీ పరిశ్రమకు అంతగా కలిసిరాలేదని. ఒక పక్క కరోనా వల్ల షూటింగ్ లేక, థియేటర్స్ లేక.. సినిమా షూటింగ్ లు ఆగిపోయి భారీ నష్టమే వాటిల్లగా.. మరోపక్క పలు సినీ పరిశ్రమలకు చెందిన నటులు మృతి చెందుతూ విషాదం మిగులుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో లెజెండరీ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, ఇంకా యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇలా ఎంతో మంది ఈ ఏడాది తనువు చాలించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో విషాదం నెలకొంది. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూశారు. రెండు వారాల క్రితం ఇలానే శ్వాస సంబంధిత సమస్య కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా కోవిడ్19 నెగటివ్‌గా నిర్ధారించారు. అయితే ఇప్పుడు మరోసారి అదే సమస్య రావడంతో.. ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న సరోజ్ ఖాన్ కు రాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు సరోజ్ ఖాన్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమెకు భర్ సోహన్ లాల్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు

కాగా 1948 నవంబరు 22న సరోజ్‌ ఖాన్‌ జన్మించారు. బాలీవుడ్ మాస్టర్జీగా పాపులర్‌ అయిన సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్. 1975లో మౌసమ్ సినిమాతో బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా పరిచయమైన సరోజ్ ఖాన్ కేవలం బాలీవుడ్ లోనే కాదు అనేక భాషల్లో కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. దాదాపు 40 ఏళ్లపాటు 2,000కుపైగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. అంతేకాదు పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా మూడు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. పలు ఫిలిం ఫేర్ లను అందుకున్నారు. సరోజ్ ఖాన్ చివరిసారిగా 2019లో ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ నిర్మించిన కళంక్ మూవీలో మాధురీ నర్తించిన తబా హోగయీ పాటకి కొరియోగ్రఫి చేశారు.

ఇక తెలుగులో కూడా ఆమె పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. చిరంజీవి చూడాలని ఉంది, డాడీ సినిమాలకు గాను ఆమె కొరియోగ్రఫీ అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =