ఇలియానా ’80 డేస్ ఛాలెంజ్’

Actress Ileana Takes Up 80 Days Fitness Challenge

గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని చెప్పనక్కర్లేదు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఇలియానా. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించి చాలా కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే అప్పట్లో ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉండి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు బ్రేకప్ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు బ్రేకప్ అయిందనుకోండి. తన ప్రియుడితో విడిపోయినట్లు తానే తెలిపింది. ప్రస్తుతం సింగిల్ గానే వుంటూ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా 80 డేస్ ఛాలెంజ్ తీసుకున్నట్టు చెపుతుంది ఈ భామ. మరి అదేంటో తెలుసుకోవాలంటే ఇలియానా ఏం చెపుతుందో వినాల్సిందే. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఫిట్ నెస్ పై ఫోక‌స్ పెట్టాన‌ని… జిమ్ లో అయితే పర్సనల్ ట్రైనర్ ఉంటారు కాబట్టి పెద్దగా కష్టం అనిపించదు.. కానీ ఇంట్లో ఉండి చేయాలంటే కొంచం కష్టం.. మొదటి పదిరోజులు చాలా కష్టంగా అనిపించింది.. మూడు నెలల తర్వాత నాలో మార్పు నన్నే ఆశ్చర్యపరచింది. ఇప్పుడు వర్కవుట్స్‌ నాకు ఓ వ్యసనంలా మారాయి. వ్యాయామం వల్ల ఆరంభంలో వున్న ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరింది అని తెలిపింది.

ప్ర‌స్తుతం ది బిగ్‌బుల్ పేరుతో రూపొందుతున్న ఓ హిందీ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉంది. ఇక తెలుగులో నాగార్జున హీరోగా `గ‌రుడ‌వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమాలో నాగార్జున స‌ర‌స‌న ఇలియానా న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 9 =