తెలుగు , తమిళ , మలయాళ భాషల ప్రేక్షకులను 17 సంవత్సరాలుగా అలరిస్తూ నయన తార సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో నయనతార ప్రేక్షకులను ఆకట్టుకుని లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. నయనతార ప్రస్తుతం “నేత్రికన్ “, “మూకుత్తి అమ్మన్ “, ‘అన్నా త్తే “తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార , సమంత ప్రధాన పాత్రలలో ” కాతు వాక్కుల రెండు కాదల్ “తమిళ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో నయనతార అంధురాలిగా నటిస్తున్నారు. ఇంతకు ముందు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన “నానుమ్ రౌడీ దాన్ “తమిళ మూవీ లో నయనతార హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్న యువతిగా నటించిన విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన “సైరా నరసింహా రెడ్డి ” మూవీ లో హీరోయిన్ గా నటించిన నయనతార తరువాత తెలుగు లో ఏ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: