సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన నివాసంలో మొక్కలు నాటి పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం అంటూ మరో ముగ్గురు స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్, నటి శృతిహాసన్‌లకు ఛాలెంజ్ విసిరారు. ఇక దీనిలో భాగంగా మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించాడు విజయ్. ఈ నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటాడు విజయ్. మహేష్ ఇది నీకోసం… గ్రీనర్ ఇండియా.. గుడ్ హెల్త్ థ్యాంక్యూ అంటూ మొక్కలు నాటుతూ తన ఆ పోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. మహేష్ విసిరినా ఛాలెంజ్ కు శృతి హాసన్ స్పందించి త్వరలో మొక్కలు నాటుతానని తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
This is for you @urstrulyMahesh garu. Here’s to a Greener India and Good health. Thank you #StaySafe pic.twitter.com/1mRYknFDwA
— Vijay (@actorvijay) August 11, 2020
ఇక ఇండస్ట్రీస్ వేరైనా కూడా తెలుగు, తమిళ్ స్టార్స్ స్నేహపూర్వకంగానే ఉంటారు. ఇండస్ట్రీలు వేరైనా కూడా అంతా కలిసే ఉంటారు. సూర్య, కార్తి, విశాల్ లాంటి హీరోలు మన హీరోలతో చాలా ప్రేమగా ఉంటారు. ఇక విజయ్ కూడా తెలుగులో మహేష్ బాబుకు మంచిస్నేహితుడు. కాగా తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ను ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ పూర్తి చేశారు.
ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక విజయ్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది చిత్రయూనిట్. ఇక ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: