జపాన్ లోకి ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌’

Naveen Polisetty Agent Sai Srinivasa Athreya Goes To Japan

గత ఏడాది వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ‘షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్రా.. కానీ ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్’ అంటూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు నవీన్ పోలిశెట్టి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైల‌జీగా వ‌స్తుంద‌ని తాజాగా ప్రకటించారు ఈ సినిమా నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా. బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని ఆ సినిమా ట్రైల‌జీగా వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. అంటే ఆ చిత్రానికి మ‌రో రెండు భాగాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ రెండో భాగం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్ఎస్‌జె ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. త‌న రెండో సినిమా పూర్తవ‌గానే డైరెక్టర్ స్వరూప్ సెకండ్ పార్ట్‌ను చేప‌డ‌తారు. స్క్రిప్ట్ త‌యార‌వుతున్న విధానానికి మేం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాం. త్వర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాలు వెల్లడిస్తాం అని చెప్పారు

మ‌రోవైపు, ఈ సినిమా హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం రీమేక్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయాయి. త్వ‌ర‌లో క‌న్న‌డ హ‌క్కులు కూడా అమ్ముడు కానున్నాయి. ఇంకో విశేష‌మేమంటే ఈ సినిమా జ‌పాన్ భాష‌లో అనువాద‌మ‌వుతోంది. సెప్టెంబ‌ర్ 11న అక్క‌డ విడుద‌ల‌వుతోంది.

ఇటీవ‌లి కాలంలో మ‌రే తెలుగు సినిమా ఇన్ని భాష‌ల్లో రీమేక్ కాలేద‌న్న‌ది నిజం. ఇది ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ సాధించిన ఘ‌న‌త‌గా చెప్పుకోవ‌చ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =