టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే.. లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక పెళ్లి తరువాత హీరోయిన్లకు పెద్దగా సినిమాలు రావు.. సక్సెస్ రేట్ కూడా తక్కువగానే ఉంటుంది.. కానీ అమ్మడు అదృష్టం ఏంటో కానీ పెళ్లి తరువాత కూడా అవకాశాలు తగ్గలేదు కదా.. వరుస హిట్లు కొట్టేస్తుంది. అందుకే ఇప్పుడు ఎంతో మందికి సమంత ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సమంతపై ప్రియమణి కూడా ప్రశంసలు కురిపించింది. నిజానికి పెళ్లికి ముందు పెళ్ళికి తర్వాత హీరోయిన్స్ కెరీర్ డిఫరెంట్ గా ఉండేది ఒకప్పుడు… నిశ్ఛితార్థం అయిందని తెలిస్తేనే ఒకప్పుడు హీరోయిన్‌కు అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. ఇండస్ట్రీ మైండ్ సెట్ కూడా మారింది. దానికి సమంతానే మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు… పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. హీరోయిన్ గా కొనసాగుతూనే వరుస హిట్స్ తో దూసుకుపోతుంది… ఆమె ఫిజిక్ మెయింటెనెన్స్ అద్భుతం అని పొగడ్తలు కురిపించింది. నాకు కూడా బాగానే అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి, ఓటీటీల నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయ`ని ప్రియమణి తెలిపింది.
పెళ్ళైనకొత్తలో సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. తన 15 ఏళ్ల సినీ కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ పలు భాషల్లో ఆమె నటించింది. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తుంది. ‘కామ్రేడ్ భారతక్క’ అనే పాత్రలో ప్రియమణి నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రియమణి సురేష్ ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న నారప్ప సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు పలు టీవీ ప్రోగ్రామ్స్ లో జడ్జిగా వ్యవరిస్తుంది ప్రియమణి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: