సక్సెస్ ఫుల్ “ఆనందో బ్రహ్మ “, “యాత్ర ” మూవీస్ తో అలరించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ప్రముఖ OTT ద్వారా ఈ వెబ్ సిరీస్ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో ప్రసారం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు మహి మాట్లాడుతూ .. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితాన్ని ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేనందుకు సిద్ధం అవుతున్నానని , అతని జీవితంలోని కీలక సంఘటనలు , వివాదాస్పద విషయాలు తెలుకున్నానని, అందుకే దావూద్ ఇబ్రహీం బయోపిక్ ను రూపొందించనున్నానని తెలిపారు. డాన్ దావూద్ పై వెబ్ సిరీస్ రూపొందించాలనే సాహస నిర్ణయం దర్శకుడు మహి తీసుకున్నారు. దావూద్ ఇండియా లో లేకపోయినా , ఆయన అనుచరుల వల్ల లాభం పొందినవారు చాలామంది ముంబై లో ఉండే ఉంటారు వారివల్ల వెబ్ సిరీస్ కు , దర్శకుడి ప్రమాదం ఉండే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: