లాక్ డౌన్ లో సింగిల్ లైఫ్ ఇలా..!

Actress Shruti Haasan Shares A Video Glimpse Of Her Quarantine Life On Social Media

లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అందరూ ఇంట్లోనే వుంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ కూడా కొత్త కొత్త వంటలు.. ఆన్లైన్ క్లాసెస్.. వర్కౌట్స్ అంటూ దొరికిన సమయాన్ని బాగానే ఉపయోగించుకుంటున్నారు. అలాగే లాక్ డౌన్ లోనే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటూ తమ అప్ డేట్స్ ఇస్తున్నారు.

ఇక తన సోషల్ మీడియాలో రోజుకో కొత్త ఫొటో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది హీరోయిన్ శ్రుతీ హాసన్. ఇక ఇప్ప్పుడు తాజాగా తన ఇన్స్టా లో ఒక వీడియో పోస్ట్ చేసింది శ్రుతీ హాసన్. లాక్‌డౌన్‌లో తన ఒంటరి జీవితానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి… లాక్ డౌన్ లో సింగిల్స్ ఎలా ఉంటారు అనేది ఈ వీడియో లో చూపించింది. బద్ధకంగా నిద్ర లేవడం, జుట్టు వాసన చూడడం, ఫొటోషూట్లలో పాల్గొనడం వంటి విషయాలు ఆ వీడియోలో చూపించింది శ్రుతి. అంతేకాదు లాక్‌డౌన్‌లో ఒంటరిగా ఉన్న వారి జీవితం వంద రోజుల తర్వాత ఇలాగే కనిపిస్తుంద`ని పేర్కొంది.

కమల్ హాసన్ కుమార్తెగా పరిచయమైనప్పటికీ శృతి హాసన్ తన నటన అభినయంతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అయితే కొన్ని కారణాల వల్ల శ్రుతి గత మూడేళ్ళుగా నటనకు దూరమైంది. అయితే మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం తెలుగులో క్రాక్ సినిమా.. తమిళ్ లో లాభం అనే సినిమా చేస్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here