కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. దాదాపు 3 నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని షరతులతో కూడిన షూటింగ్స్ అనుమతినిచ్చినా ఒకటి , రెండు చిన్న చిత్రాలు తప్ప పెద్ద సినిమాలు సెట్స్ కు వెళ్ళలేదు. స్టార్ , హీరో , హీరోయిన్స్ ఈ పరిస్థితులలో షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడంలేదు. 4 నెలలకు పైగా ఇంటికే పరిమితం అయిన తమన్నా సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , తన ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ తమన్నా ఒక ఇంటర్వ్యూ లో షూటింగ్స్ పునః ప్రారంభం పై తన అభిప్రాయం చెప్పారు. షూటింగ్స్ పునః ప్రారంభం అయితే నటీ నటులతోపాటు యూనిట్ మెంబర్స్ సేఫ్టీ ముఖ్యమని , పెద్ద సినిమాలకు యూనిట్ మెంబర్స్ అధికంగా ఉంటారని , రిస్క్ ఎక్కువగా ఉంటుందని , మూవీస్ రిలీజ్ చేయడానికి థియేటర్స్ ఓపెన్ అవ్వాలని , సాధారణ పరిస్థితులు నెలకొంటేగానీ ప్రేక్షకులు థియేటర్స్ కు రారని , అందువల్ల షూటింగ్స్ పునః ప్రారంభం అవడానికి లేటవుతుందనే అభిప్రాయాన్ని తమన్నా వెల్లడించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: