గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చిలోనే సెట్స్ పైకి వెళ్ళాలి కానీ లాక్ డౌన్ వల్ల వెళ్ళలేదు. హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత పాత్ర పై ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో సమంత నటిస్తుందట. ఫిజికల్లీ చాలేంజ్డ్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు దానికోసం ఆన్లైన్ లో వర్క్ షాప్స్ కూడా చూసి నేర్చుకుంటుందట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మరోవైపు సమంత వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. గత యేడాది నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. ’96’ రీమేక్‌లో చేసినా అది కాస్త నిరాశ పరిచింది. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో పాటు ఇంకా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. తెలుగులో అయితే ఇంకా ఏ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టలేదు సామ్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























