హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. “లవ్ స్టోరీ ” మూవీ తరువాత హీరో నాగచైతన్య విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో “థ్యాంక్యూ ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా “మజిలీ ” మూవీ లో క్రికెటర్ గా నటించిన నాగచైతన్య ఇప్పుడు మరో స్పోర్ట్స్ డ్రామా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక మూవీ రూపొందనుందనీ , స్క్రిప్ట్ సిద్ధంగా ఉందనీ సమాచారం. ఈ మూవీ కి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం నితిన్ హీరోగా
“రంగ్ దే !” మూవీ రూపొందిస్తున్నారు. హీరో నాగచైతన్య డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: