డైరెక్టర్ మణి”రత్నం” గీతాంజలి

Mani Ratnam Geethanjali Movie Remains To Be A Trendsetter Of That Era

సి ఎల్ నరసారెడ్డి సమర్పణ లో భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “గీతాంజలి ” మూవీ ఘనవిజయం సాధించింది. గిరిజ కథానాయిక. ఇళయరాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెస్ట్ డైరెక్టర్ గా మణిరత్నం ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “గీతాంజలి ” మూవీ వివిధ విభాగాలలో 6 నంది అవార్డ్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు మణిరత్నం సినీ కెరీర్ లో ఏకైక మూవీ “గీతాంజలి ” బెస్ట్ పాప్యులర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. “గీతాంజలి ” మూవీ లో నాగార్జున అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. “గీతాంజలి ” మూవీ రిలీజ్ అయిన 5 నెలల తరువాత నాగార్జున హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “శివ ” మూవీ రిలీజ్ అయ్యింది. “గీతాంజలి ” , “శివ “మూవీలతో నాగార్జున క్లాస్ &మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఊటీ లో షూటింగ్ జరుపుకున్న “గీతాంజలి ” మూవీ 60 రోజులలో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ లోని “ఓప్రియా “సాంగ్ ను 100 ఒంటెలతో , “ఓం నమహ “సాంగ్ ను ట్రాలీ ఉపయోగించి సింగల్ టేక్ లో , “జల్లంత కవ్వింత “సాంగ్ ను 40 మంది పిల్లలు , 25 గుర్రాలతో , “నందికొండ వాగుల్లోన” సాంగ్ కు స్మశాన వాటిక సెట్ రూపొందించి చిత్రీకరణ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 14 =