‘మాయాబజార్’ లో సినిమాటోగ్రాఫర్ మార్కస్‌ బార్ట్లే ‘మాయ’

Cinematographer Marcus Bartley Played Crucial Role In Mayabazar Movie Success With His Camera Skills Cinematographer Marcus Bartley Played Crucial Role In Mayabazar Movie Success With His Camera Skills

మాయాబజార్ సినిమా… తెలుగు సినీ చరిత్రలోనే ఇదొక అద్భుత కావ్యం. ఈ సినిమా విడుదలై ఆరు దశాబ్దాలు దాటినా ఇప్పటి తరానికి కూడా ఈ సినిమా పరిచయమే. ఆ తరం నుండి ఈ తరం వరకూ ప్రతి సినీ ప్రేక్షకుడు నచ్చిన.. మెచ్చిన సినిమా ఇది. కె.వి రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్, సావిత్రి, గుమ్మడి వంటి హేమాహేమీలు నటించిన ఈ భారీ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ఆణిముత్యం. శశిరేఖ అనే పాత్రను సష్టించి దాని చుట్టూ అల్లిన కథ ఇది. దుస్తుల దగ్గరనుండి మేకప్ వరకూ ప్రతి విషయాన్ని ఎంతో కూలంకషంగా పరిశీలించి.. ప్రతి చిన్న విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేశారు కాబట్టే ఈ సినిమా ఇప్పటికీ గుర్తుండిపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో చెప్పుకోడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాంటి విషయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పుకుందాం. అదేంటంటే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా‌ మార్కస్‌ బార్ట్లే పని చేశారు. ఈ సినిమా అంత అద్భుతంగా రావడానికి ఒక కారణం మార్కస్‌ బార్ట్లేనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన లాహిరి..పాటను కేవలం 10-15 సెకండ్స్ లో తీశారంటే ఎవరైనా నమ్మగలరా. అసలు సంగతేంటంటే.. ఈ సినిమాలో లాహిరి-లాహిరి పాట తెలుసు కదా. మంచి వెన్నెల్లో ఉంటుంది ఆ పాట. అసలు నిజం ఏంటంటే.. ఈ పాటను అస్సలు వెన్నెల్లోనే తీయలేదట. నిజానికి ఈ పాటను చెన్నైలోని అడయార్‌ నదిలో తీశారు. అది కూడా ఎండలో. అయితే జస్ట్ ఒక షాట్ తీసి వెనక చెట్లు, ఇతర దృశ్యాలూ కనిపించేలా తెల్లటి తెర వేసి, దానికి తగ్గట్టుగా లైటింగ్‌ ఏర్పాటు చేసి అచ్చం వెన్నెల ఎఫెక్టును తీసుకొచ్చారట. అంతే కాదు ద్వారకను కూడా ఆయన 300 మీనియేచర్ హౌసెస్ తో షూట్ చేశారట.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు బోంబేలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన మార్కస్‌ బార్ట్లే… తొలుత ఆయన ఒక తమిళ చిత్రానికి పనిచేశారు. అనంతరం స్వర్గసీమ చిత్రంతో విజయాలో అడుగుపెట్టారు. షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, అన్నింటికీ ఆయనే కెమెరా మేన్‌. గ్రాఫిక్స్‌ లేని కాలంలోనే ఎన్నో అద్భుతాలు చూపించాడు. ఇక మాయా బజార్ సినిమాలో అలాంటి మాయలెన్నో చూపించాడు. అత్యంత కష్టమైన షూటింగ్‌ ఇది. ఎంతో శ్రద్ధ పెట్టారు. ఆ శ్రద్ధే చిత్రం అద్భుతంగా రావడానికీ, ప్రేక్షకుల ఆదరణకు నోచుకోడానికీ కారణం. ఘటోత్కచుడి వివాహభోజనంబు పాటలోని ట్రిక్ ఫొటోగ్రఫీ, మాయాద్వారక సెట్టు, చిన్న శశిరేఖ పెద్ద శశిరేఖగా మారడము, ఘటోత్కచుని రాక్షస మాయలు తెలుగువారి మనస్సులో అరవై ఏండ్లైనా ఇంకా మాయని ముద్రలుగా నిలిచిపోయాయి.

ఇక మాయాబజార్‌’ లో కృష్ణుడిగా చేయడంతో కృష్ణుడంటే రామారావే అన్నంతగా పేరొచ్చింది. తర్వాత ఎన్నో సినిమాల్లో, రామారావు కృష్ణమూర్తిగా నటించడానికి దారి చూపింది మాయాబజారే. ఎస్వీఆర్‌ ఘటోత్కచుడిగా ప్రాణం పోశారు. నాగేశ్వరరావుగారు సరే సరి… అభిమన్యుడిగా అద్వితీయంగా నటించారు. ఇక శశిరేఖ గా చేసిన సావిత్రి ఈ సినిమా విజయానికి మరో కారణం. ఆర్ట్‌ డైరెక్షన్‌, ఫొటోగ్రఫీ, నటన.. అన్ని రంగాలూ అద్భుతంగా రాణించాయి కాబట్టే సినిమా చరిత్రలో నిలిచిపోయింది. మరి ఇలాంటి సినిమాలు ముందు ముందు వస్తాయో రావో తెలియదు కానీ.. మాయ బజార్ లాంటి సినిమా రావడం మాత్రం కష్టమే. మాయాబజార్ ఒక్కటే పీస్..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =