బ్యాక్ టు వర్క్ – మళ్లీ అడవుల్లోకి రకుల్

Actress Rakul Preet Singh Goes Back To Forest To Take Part In Movie Shooting

రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలైపోయింది. సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారమే గత కొద్దిరోజులుగా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిలా రకుల్ నటిస్తున్నట్టు ఇటీవలే బయటకు వచ్చిన ఫొటోలను బట్టి అర్థమవుతూనే వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే అనంత‌గిరి కొండ‌ల్లో జ‌రుగుతున్న షూటింగ్ భారీ వ‌ర్షం కార‌ణంగా నిలిచిపోయింది. చిత్రటీం షూటింగ్ స్పాట్ నుంచి వెనుదిరిగింది. దీంతో రకుల్ కూడా ఢిల్లీ వెళ్ళిపోయింది. ఇక తాజాగా ర‌కుల్ మ‌ళ్లీ హైద‌రాబాద్ కు వ‌చ్చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు వెంటనే వికారాబాద్ అడవుల్లో షూటింగ్ లో కూడా పాల్గొన్నట్టు సమాచారం. క్రిష్ అండ్ చిత్ర‌యూనిట్ వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ఇత‌ర తారాగ‌ణంపై వ‌చ్చే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఇంకా తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.