విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనూప్ రూబెన్స్ స్వర పరిచిన అన్ని పాటలు సంగీతాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలోని కృష్ణవేణి ..కృష్ణవేణి అనే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. యంగ్ హీరో నాగశౌర్య ఈ పాటను విడుదల చేశాడు. ఈ సందర్భంగా యంగ్ హీరో నాగశౌర్య మాట్లాడుతూ – “ ఈ సినిమాలోని కృష్ణవేణి..కృష్ణవేణి పాట నేను చూశాను. లిరిక్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్ డాన్స్ నాకు బాగా నచ్చింది. రాజ్, మాళవిక ఇద్దరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే డైరెక్టర్ విజయ్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఈ సినిమా అందరికీ నచ్చి ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ చెప్పారు. కృష్ణవేణి ..కృష్ణవేణి అంటూ రాహుల్ సిప్లిగంజ్ తనదైన శైలిలో పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ` ఈ సినిమాలోని పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడులయ్యాయి.
Here’s #Krishnaveni full video song. Tune in & get grooving! 🥁🕺#OreyBujjiga on @ahavideoIN from Oct 2https://t.co/9B0gKpEbaR@itsRajTarun @Rahulsipligunj @directorvijays @AnupRubens @KKRadhamohan @SriSathyaSaiArt @MangoMusicLabel pic.twitter.com/Ik6Z8PiARC
— Telugu FilmNagar (@telugufilmnagar) September 22, 2020
కాగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: