సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాస్త వాయిదా పడింది. ఉప్పెన నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి బర్త్డే సందర్భంగా చిత్రయూనిట్ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. “క్యూటెస్ట్ అండ్ నేచురల్ యాక్ట్రెస్ కృతి శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. పోస్టర్ లో చేతులకు గాజులు వేసుకుంటూ అపురూపంగా వాటిని చూసుకుంటోన్న కృతి శెట్టి స్టిల్ ఆకట్టుకుంటోంది.
Wishing the Cutest & Natural Actress @IamKrithiShetty a Very Happy Birthday ❤️
– Team #Uppena 🌊#HBDKrithiShetty#PanjaVaisshnavTej#BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/lXDXqrNqyK
— Mythri Movie Makers (@MythriOfficial) September 21, 2020
కాగా ఈసినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పరిస్థితులు కాస్త అనుకూలంగా వచ్చి.. థియేటర్లు తెరుచుకోగానే చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక కృతి శెట్టి కూడా క్యూట్ లుక్స్, నవ్వుతో అందరినీ కట్టిపడేసింది. అందుకే ఇంకా తన మొదటి సినిమా కూడా విడుదల కాకముందే ఆఫర్లు క్యూ కడుతున్నాయి. నిజానికి ఉప్పెన సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక రకంగా కృతి శెట్టినే కారణమని చెప్పొచ్చు. కృతి శెట్టి అందానికి.. అభినయానికి ఫిదా అయ్యారు అందరు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: