ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. మంచి కథతో పాటు.. యాక్షన్ సీక్వెన్స్ ను మంచిగా బ్యాలన్స్ చేసిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కిన సంగతి కూడా విదితమే. నాని 25 సినిమా కావడం అందులో నెగిటివ్ షేడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి. ఆ అంచనాలను కూడా సినిమా రీచ్ అయిందనే చెప్పొచ్చు. ఇక సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సుధీర్ నటన చాలా బావుంది. ఇక లుక్ పరంగా సుధీర్ పడ్డ కష్టాన్ని డైరెక్టర్ తొలి ఫైట్‌తో తెరపై ఆవిష్కరించాడుఇంద్రగంటి. ఇక సినిమాలో నాని లవర్ అదితి రావు హైదరి.. సుధీర్ లవర్‌గా నటించిన నివేదా థామస్ నటన పరంగా తమ పాత్రల్లో ఇమిడిపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ, నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి రౌండ్ టేబుల్ డిస్కషన్ లో పాల్గొని ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ కృష్ణ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్ అని… డిఫరెంట్ డిఫరెంట్ యాక్టింగ్ స్టయిల్స్ ఉన్న వారితో చేయడం మేకింగ్ లో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. ఇంకా అదితి ఈ సినిమాలో సాహేబ రోల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని.. అంతేకాదు తెలుగులో తనకు మంచి మంచి రోల్స్ వస్తున్నందుకు చాలా లక్కీ అని తెలిపింది. ఇంకా నాని నెగిటివ్ షేడ్ లో నటించడంపై.. సుధీర్ బాబు పోలీస్ గా నటించడం.. నివేదా క్రైమ్ నవలా రచయితగా అపూర్వ పాత్రలో నటించడం పై ఒక్కొక్కరు తమ ఎక్స్పీరియన్స్ లను షేర్ చేసుకున్నారు. మరి మీరు కూడా ఆ ఫుల్ వీడియో ఒకసారి చూసేయండి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: