‘బ్లాక్‌ రోజ్‌’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్

Urvashi Rautela Black Rose First Look Poster Is Out

బాలీవుడ్ అందాల తార ఊర్వ‌శి రౌటేలా టాలీవుడ్ లోకి ‘బ్లాక్ రోస్‌’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మోహ‌న్ భ‌రద్వాజ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమాలో ఊర్వ‌శి రౌటేలా లీడ్ రోల్ లో న‌టిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసారు.గత నెలలో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటుంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఒకే షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సంపత్ నంది తన ట్విట్టర్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోస్ట్ చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

కాగా పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షేక్స్ పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘బ్లాక్ రోజ్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాష‌ల్లో తెరెకెక్కించనున్నారు.

ప్రస్తుతం సంపత్ నంది హీరో గోపీచంద్ తో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్ర‌స్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.