‘స్టార్ ప్రొడ్యూసర్’ కు ‘సూపర్ స్టార్’ విషెస్

Mahesh Babu wishes anil sunkara on his birthday

సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కేవలం వ్యక్తిగత విషయాలు..సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు.. మిగిలిన విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూనే వుంటారు. ఇక ఈ రోజు అనిల్ సుంకర పుట్టిన రోజు కావడంతో ఆయనకు తన ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నా సూపర్ నిర్మాత అనిల్ సుంకరకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నా షూట్ లో నన్ను సరదాగా సౌకర్యవంతంగా ఉంచే వ్యక్తి, సెట్ లో పని ఒత్తిడి మధ్య అలా ఉండటం అంత తేలికైన విషయం కాదు. ఇలాగే నవ్వుతూ ఉండండి సార్. మీకు ఎల్లప్పుడూ ఆరోగ్యం మరియు ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను”. అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 1 =