‘తిమ్మరుసు’ అఫీషియల్ గా లాంచ్

Satyadev and Priyanka Jawalkar's New Movie Gets Launched

టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట నిజస్వరూపం చూపించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈ సినిమా రీమేక్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇంకా దీనితో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేయనున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాను ప్రకటన చేశారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా రీసెంట్ గానే జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమాలో సత్యదేవ్ ఒక డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడని… ఒక నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని.. అక్టోబర్ 21 నుండి సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నామని తెలిపారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 2 =