బిగ్ బాస్ – 4.. సక్సెస్ ఫుల్ గా 6వారాలు పూర్తి చేసుకున్న హౌస్ 7వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఎప్పటి లాగే పాటతో ఇంటి సభ్యులు నిద్రలేవగా.. ఆ తర్వాత ఎవరి పనులతో వారు బిజీ అయ్యారు. ఇక కుమార్ సాయి ఇచ్చిన బిగ్ బాంబ్ వల్ల మాస్టర్ బాత్‌రూం పరిసరాలను క్లీన్ చేసే పనిలో పడ్డారు. మరోపక్క హారిక పొడవాటి టీ-షర్ట్ ను వేసుకోగా దానికి హారిక ను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. అవినాష్ కామెడీకి పక్కనే ఉన్న అఖిల్, సోహైల్ నవ్వుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకోవైపు అభిజిత్ ను మోనాల్ ను కలిపే ప్రయత్నం చేస్తుంది అరియనా. ఇదే విషయాన్ని ముందు నోయల్ తో చెప్పగా ట్రై చేయడంలో తప్పులేదని చెప్పడంతో అభిజిత్‌తో మాట్లాడేందుకు ఆయన దగ్గరకు వెళ్ళింది. అయితే అభి మాత్రం ఆ విషయం అయితే మాట్లాడకపోవడమే బెటర్ అని.. తనతో ఇంకా ఎప్పుడు మాట్లాడనని చెప్పాడు.
ఇక ఆ వెంటనే నామినేషన్ లోకి వెళ్ళిపోయాడు బిగ్ బాస్. రంగుపడుద్ది అనే కాన్సెప్ట్ ను ఇచ్చాడు ఈసారి. అమ్మ రాజశేఖర్ కు ఇమ్యూనిటీ ఉండటంతో నామినేషన్ నుండి తప్పించుకున్నాడు. ఇక ఇప్పుడు కెప్టెన్‌గా ఉన్న నోయల్ గత వారం డీల్‌లో భాగంగా నామినేషన్ లో ఉండటంతో డైరెక్ట్ గా నామినేట్ అయ్యాడు. ఇక మిగిలిన ఇంటి సభ్యులను జంటలుగా విడదీశారు. అది కూడా క్లోజ్ గా ఉండేవాళ్ళని జంటలుగా విడదీసి ట్విస్ట్ ఇచ్చాడు.
అఖిల్-మోనాల్ ఓ జంట, హారిక-అభిజిత్, సొహైల్-అవినాష్, దివి-లాస్య, మెహబూబ్-అరియానా లు జంటలుగా విడదీశారు. అఖిల్- మోనాల్ జంట ఎవరు నామినేషన్‌లోకి వెళ్ళాలి, ఎవరు సేవ్ కావాలనే విషయంపై చర్చించారు. అన్ని విషయాలలో నీ కన్నా నేను ఎక్కువ పర్‌ఫార్మెన్స్ చేశాను అని అఖిల్ చెప్పడంతో మోనాల్ నామినేషన్‌లో వెళ్లింది. దీంతో అఖిల్ ఆమెపై బకెట్‌లో ఉన్న రంగు నీళ్ళు పోసాడు. సోహైల్- అవినాష్‌లు కొంత సేపు చర్చించారు. వారిద్దరిలో అవినాష్ నామినేట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. అభిజిత్- హారికల మధ్య నామినేషన్ విషయంలో చాలా సేపు చర్చ జరిగింది. ఈ జంటలో అభిజిత్ నామినేట్ అయ్యాడు. దివి- లాస్య టైం వచ్చే సరికి లాస్య తన వర్షెన్‌ను చెప్పుకొచ్చింది. ఈ సారి తన అభిమానులకు కొంత రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా అని లాస్య పేర్కొంది. ఇక దివి నేనంటే నీకు పడటంలేదని, ఇప్పటి నుంచైనా నాపై ఉన్న బ్యాడ్ ఒపీనియన్ మార్చుకోవాలని ఆశిస్తూ నామినేషన్‌కి వెళ్తున్నా అని చెప్పింది. దీంతో లాస్య .. దివిపై రంగు నీళ్ళు పోసింది. ఐదు జంటలలో నాలుగు జంటల మధ్య చర్చ తొందరగానే కొలిక్కి వచ్చినప్పటికీ అరియానా-మెహబూబ్‌లు మాత్రం పోటా పోటీగా వాదనలు జరిపారు. చివరకు అరియానా తాను నామినేట్ అవుతున్నా అని చెప్పి నామినేట్ అయింది.
ఫైనల్ గా ఏడో వారంలో మోనాల్, అవినాష్, అభిజిత్, దివి, అరియానా, నోయల్ ఎలిమినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలంటే మాత్రం వీకెండ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: