ఐశ్వర్య రాజేష్ ‘భూమిక’ ఫస్ట్‌లుక్ రిలీజ్

విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ‘భూమిక’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది ఐశ్వర్య రాజేష్. ఈ థిల్ల‌ర్ ఐశ్వ‌ర్య రాజేశ్‌కి 25వ సినిమా కావ‌డం విశేషం. ఈ చిత్రానికి రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తుండగా.. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాష‌‌న్ 8 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కార్తికేయ‌న్ సంతాన‌మ్, సుధాన్ సుంద‌ర‌మ్, జ‌య‌రామన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ సైక్రియాటిస్టు పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టాప్‌ హీరోయిన్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా సోమవారం విడుద‌ల చేశారు. ఐశ్వర్య రాజేశ్‌ నటించిన 25 వ చిత్రం ‘భూమిక’ ఫస్ట్ లుక్‌ విడుదల చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలుపుతూ.. చిత్రయూనిట్‌కు తమన్నా శుభాకాంక్షలు తెలిపింది.

 

ఆద్యంతం థ్రిల్ ఫీల్ అయ్యే స‌న్నివేశాల‌తో భూమికను తెర‌కెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అఫీషియ‌ల్‌గా ప్రకటిస్తారు. మరి ఈ సినిమా ఎంతవరకూ ఐశ్వర్య రాజేష్ కు సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fifteen =