భారీ వర్షాలపై విజయ్ దేవరకొండ స్పందన

Vijay Deverakonda Depressed With The Situation In Hyderabad

గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. జన జీవనం అస్తవ్యస్త మైంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వందకు పైగా కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి . ఇళ్ళు కూలిపోయి , వాహనాలు కొట్టుకుపోయి , నిత్యావసరాలు తడిచిపోయి ప్రజలు తిండి , నిద్ర లేక అలమటిస్తున్నారు. వాగులు , వంకలు పొంగి , చెరువు కట్టలు తెగి తెలంగాణలో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. నాలాలు పొంగి పొర్లాయి. మూసీ నది విశ్వరూపం దాల్చింది. పోలీసుల సాయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు జిహెచ్ఎంసి తరలిస్తోంది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న “ఫైటర్ “మూవీ షూటింగ్ కరోనా కారణంగా 7నెలలుగా నిలిచిపోయింది. “ఫైటర్ “మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానందున హీరో విజయ్ వెకేషన్ కి యూరోప్ వెళ్ళారు. హైదరాబాద్ లోని భారీ వర్షాలకు , ప్రజల ఇక్కట్లకు విజయ్ స్పందించారు. ఈ టైమ్ లో హైదరాబాద్ కుదూరంగా ఉండడం విచారంగా ఉందనీ , మీ గురించి అనుక్షణం ఆలోచిస్తున్నాననీ , ప్రతీ ఒక్కరి గురించీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాననీ , తన ప్రేమ , సపోర్ట్ ఎప్పుడూ ఉంటాయనీ అభిమానులు , ప్రజలకి విజయ్ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ సమయంలో విజయ్ పలు కుటుంబాలకు సహాయం అందించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − two =