తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ తాప్సీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తమిళ , హిందీ భాష చిత్రాల షూటింగ్స్ తో తాప్సీ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా “అన్నా బెల్లె “తమిళ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసి విహార యాత్రకు మాల్దీవులు వెళ్ళి తాప్సీ ఎంజాయ్ చేశారు. ఆ విహార యాత్రను ముగించుకుని తాప్సీ కొవిడ్ – 19 టెస్ట్ లో నెగటివ్ రావడంతో హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కలర్ యెల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ పై వినీల్ మ్యాథ్యూ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో మిస్టరీ థ్రిల్లర్ “హసీనా దిల్ రుబా ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో తాప్సీ రాణి కశ్యప పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్న తాప్సీ వర్క్ మోడ్ మొదలయ్యింది , షూటింగ్స్ తో బిజీగా మారడం ఆనందంగా ఉందనీ , లైట్స్ , కెమెరా , యాక్షన్ కశ్యప బ్యాక్ ఇన్ ది హౌస్ అంటూ పెద్ద ముక్కుపుడకతో ఉన్న తన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. “రష్మీ రాకెట్ “, “లూప్ లపేటా”,”శభాష్ మిథు ” మూవీస్ కు తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “జనగణమన “తమిళ మూవీ లో కూడా తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: