కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో తన సత్తా చాటిన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఆ మాత్రం క్యూరియాసిటీ ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ కు దూరంగా ఉన్న టీమ్ రీసెంట్ గానే షూట్ ను స్టార్ట్ చేసింది. అంతేకాదు స్టార్ట్ చేస్తూ ఎన్టీఆర్ టీజర్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక అప్పటినుండి ఆ తరుణం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈ ఇంట్రడక్షన్ టీజర్ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వలన టీజర్ కాస్త ఆలస్యం అయింది. అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు కొమరం భీం ఎన్టీఆర్ తన వాయిస్‌తో అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వగా ఇప్పుడు రామరాజు.. భీం కోసం ఇవ్వనున్న గిఫ్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఆ సర్ ప్రయిజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అక్టోబర్ 22 న ఉదయం 11 గంటలకు తారక్ భీం టీజర్ ను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.
#RamarajuForBheem at 11 AM on October 22nd 🔥🌊
Bheem Arrives in 2 Days… ✊🏻@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @aliaa08 @ajaydevgn @OliviaMorris891 @DVVMovies @RRRMovie #RRRMovie pic.twitter.com/n7RYv9v5dZ
— DVV Entertainment (@DVVMovies) October 20, 2020
కాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొదలు పెట్టి కూడా దాదాపు రెండేళ్లు అవుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా ఈ సినిమాలో అలియా భట్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: