ఆ ఘనత మనవాళ్లదే ..!

Here is a Quick Rundown About Top Legends Who Have Taken Tollywood To Next Level

మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండ్రీస్ ఉన్నారు. ఈ తరం వాళ్లు స్ఫూర్తి పొందడానికి ఎంతో మంది నుండి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోడానికి ఎంతో మంది ఆదర్శవంతులు ఉన్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ రోజుకు రోజుకు అభివృద్ది చెందుతుందే తప్పా ఎప్పుడూ వెనుకపడలేదు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సినిమా కథలను తీసుకొని రీమేక్ చేస్తున్నారంటేనే చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా అనేది ఎంత ముందడుగులో ఉందో. ఇక మన తెలుగు సినీ చరిత్రలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామా నాయుడు

1963లో ‘ అనురాగం ‘ సినిమాలో పార్ట్ ప్రొడ్యూసర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన రామానాయుడు 1964లో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి ‘రాముడు భీముడు ‘చిత్రంతో సోలో ప్రొడ్యూసర్ గా ఘన విజయాన్ని అందుకున్నారు. ఆనాటి నుండి 50 సంవత్సరాల పాటు నిరంతర సేవలు అందించారు. నెంబర్ వన్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ వంటి అభినందనలు అందుకుంటూ ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగారు రామానాయుడు. భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ స్థాయికి ఎదిగారు. 130కి పైగా చిత్రాలు నిర్మించి ప్రపంచ చలన చిత్ర చరిత్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు.

విజయ నిర్మల

నటి, డైరెక్టర్, నిర్మాత ఇలా తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించిన అలనాటి అందాల తార విజయనిర్మల. తన సినీ జీవితంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు విజయనిర్మల. రంగుల రాట్నం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన విజయనిర్మల ఆ తరువాత వెనక్కిచూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక సాక్షి సినిమాలో జంటగా నటించిన కృష్ణ. విజయనిర్మల ఆ పరిచయంతో రియల్ లైఫ్ లో కూడా జీవితభాగస్వామ్యులుగా మారి ఆ తరువాత ఏకంగా 40కు పైగా సినిమాల్లో కలిసి నటించారు. ఇక 2002లో గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు.

ఎస్పీ బాలు

తెలుగు సినీ సంగీత రంగంలో బాలు లాంటి మహోన్నత గాయకుడు లేడు.. ఇకపై రాడు. విల‌క్ష‌ణ‌మైన గాత్రంతో ఐదు ద‌శాబ్ధాలుగా అల‌రిస్తూ వ‌స్తున్న బాలు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ ఇలా 11 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. కేవలం సింగర్ గానే కాదు నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు. కమల్ హాసన్, రజినీ కాంత్, జెమినీ గణేశన్ లకు గాత్రదానం కూడా చేశారు. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులను సొంతంచేసుకున్నారు. ఎన్నో వేల పాట‌లు పాడి ఆయ‌న గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.

బ్రహ్మానందం

తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వుల పువ్వులు పూయించిన.. పూయిస్తున్న స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈయన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో బ్రహ్మానందం ప్రేక్షకులను అలరించారు. 1000 పైగా సినిమాలలో నటించి బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందారు . పద్మశ్రీ పురస్కారంతో పాటు బెస్ట్ కమెడియన్ గా 6 నంది, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ వారుకూడా బ్రహ్మనందం గారిని సన్మానించారు. ఇప్పటివరకు మన తెలుగు వారిలో ఇలా అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని పొందిన వారిలో ఎస్వీ రంగారావు మొదట ఉండగా, రెండో వ్యక్తిగా బ్రహ్మానందం ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 7 =