ఇకపై నా సినిమాను నేనే నిర్మించుకుంటా..!

Director Sandeep Reddy Vanga Takes Decision To Produce His Movies By Himself

అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగా తెలుగులో ఎన్ని సంచలనాలు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇక్కడ అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కొట్టి ఏకంగా బాలీవుడ్ లో డైరెక్ట్ చేసే అవకాశాన్ని కొట్టేసాడు సందీప్ వంగా. సందీప్ వంగా డైరెక్షన్ చేస్తేనే రీమేక్ చేస్తానని షాహిద్ కపూర్ చెప్పాడంటేనే అర్ధం చేసుకోవచ్చు సందీప్ కి ఎంత క్రేజ్ ఉందో. ఇక షాహిద్ కోరిక మేరకు హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోసారి కూడా బాలీవుడ్ లోనే సందీప్ మరో సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను తానే నిర్మిస్తున్నాడట. కబీర్ సింగ్ నిర్మాతలతో కలిసి తన రెండో చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు.. నిర్మాతగా వ్యవహరించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సందీప్ రెడ్డి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అదేంటంటే.. ఇకపై తాను దర్శకత్వం వహించనున్న సినిమాలను తానే నిర్మించాలని నిర్ణయించుకున్నట్టు తెలుపుతున్నాడు. ఎందుకంటే వేరే నిర్మాతల వల్ల తన క్రియేటివ్ ఫీల్డ్ కు అడ్డు కాకూడదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెపుతున్నాడు. మరి కొన్ని సార్లు నిజంగానే నిర్మాతలు చెప్పింది చేయాల్సి వస్తుంది. మరి సందీప్ ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాడంటే గతంలో ఏదో అనుభవం అయ్యేవుంటది. కాగా తన మొదటి సినిమాను తానే నిర్మించిన సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.