బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ హీరోయిన్ రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “గీత గోవిందం”, “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కన్నడ భాషలో సూపర్ హిట్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. రష్మిక ప్రస్తుతం “పుష్ప “మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సోషల్ మీడియా లో తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న రష్మిక ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా స్టార్ హీరోయిన్ రష్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. రష్మిక హీరోయిన్ గా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: