తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో “ఉప్పెన ” మూవీ ఫేమ్ వైష్ణవ తేజ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేస్ లో రకుల్ ను సెప్టెంబర్ 25 వ తేదీ నార్కోటిక్ అధికారులు విచారించారు. అప్పటి నుండి రకుల్ షూటింగ్ లో పాల్గొనలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రిష్ దర్శకత్వంలో వికారాబాద్ అడవుల్లో రూపొందుతున్న మూవీ షూటింగ్ లో రకుల్ సోమవారం నుండి పాల్గొంటున్నారు. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం కొన్ని రెయిన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా షూటింగ్ లో పాల్గొంటున్నట్టు రకుల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వర్షంలో షూటింగ్ అంటే కెమెరాలతో పాటు మనల్ని మనం రక్షించుకోవాలనీ , కొవిడ్ -19 మాత్రమే కాకుండా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలను కూడా ఎదుర్కొని చిత్రీకరణ జరుగుతుందనీ , ఏం జరిగినా షూటింగ్ మాత్రం ఆపలేం అంటూ రకుల్ కొన్ని ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: