కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 101

షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "అన్నాత్తే "

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ "అన్నాత్తే " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నయనతార , కీర్తి సురేష్ , మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంగీతం డి ఇమ్మాన్ అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

F3 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కాబోయే వరుడు.. వెడ్డింగ్ గురించి రకుల్ మాటల్లో

రకుల్ ప్రీత్ సింగ్ గతంలో ఒకసారి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి.. ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి అని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక ఇప్పుడు మరోసారి తనకు కాబోయేవాడు ఎలా ఉండాలి, తమ పెళ్లి ఎలా జరగాలి అనే విషయాలు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్‌లో పాల్గొంది. ఇక ఈ సందర్భంగా ఆమె..తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకముందని చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబం నుంచి వచ్చానని, నాన్న ఆర్మీ ఉద్యోగం చేశారు కాబట్టి ఆ వాతావరణంలోనే పెరిగానని తనకు కాబోయే భర్త కూడా ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని ఫాలో అయితే చాలా సంతోష పడతానని తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు సమంత సిద్ధం

ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా కోట్లాది మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండగ క్రిస్మస్. ప్రపంచవ్యప్తంగా క్రిస్మస్ పండగను క్రైస్తవులు మత పరంగానూ , క్రైస్తవేతరులు సంస్కృతికంగానూ జరుపుకుంటారు. క్రిస్మస్ పండగ వేడుకలలో క్రిస్మస్ ట్రీ , లైటింగ్ , బహుమతులు , కొవ్వొత్తులు , అలంకరణలు , ప్రార్ధనలు వంటి వాటికి ప్రాధాన్యత ఉంటుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "పుష్ప "మూవీ షూటింగ్

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , సునీల్ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న "పుష్ప "మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈమూవీ లో తన పాత్రకై రష్మిక రాయలసీమ స్లాంగ్ ను నేర్చుకున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"జంగిల్ " మూవీ టీజర్ రిలీజ్

బ్లాక్ బస్టర్ "ప్రేమకావాలి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ "సుకుమారుడు ", "రఫ్ ", చుట్టాలబ్బాయి ", ఆపరేషన్ గోల్డ్ ఫిష్ " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఆది ఇప్పుడు ఒక హారర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. హీరో ఆది ఫస్ట్ టైమ్ హారర్ మూవీలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రియమైన స్నేహితుడికి హ్యాపీ బర్త్ డే

తమిళ్, తెలుగు, హిందీ ఒక్క భాష కాదు.. ఒక్క దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న హీరో ఎవరైనా వున్నారంటే అది రజినీ కాంత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు బాలచందర్‌ పరిచయం చేసిన ఎంతో మంది గొప్ప నటుల్లో రజినీ ఒకరు. కె. బాల చందర్‌ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు రజనీకాంత్‌. మొదటి సినిమాతోనే అందరికీ రిజిస్టర్ అయిపోయాడు రజినీ. ఆ తర్వాత తన డిఫరెంట్ స్టయిల్ తో.. డిఫరెంట్ మాడ్యులేషన్ తో తక్కువ టైంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ఇప్పుడు యావత్ ప్రపంచం గర్వించదగ్గ నటుడయ్యారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'గువ్వ గోరింక' ట్రైలర్ రిలీజ్ - డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్ లో

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ వరుస సినిమాలతో కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసాడు. ఆ సినిమాకు ఎంత మంచి విమర్శలు దక్కాయో తెలుసు. ఇక ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ రీమేక్ గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Actress Shruti Haasan Says That She Would Name Her Biopic Title As Jwalamukhi
సినిమా వార్తలు

శృతి హాసన్ "జ్వాలాముఖి"

మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ షూటింగ్ ను శృతి రీసెంట్ గా కంప్లీట్ చేశారు . విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ లో శృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. త్వరలోనే శృతి "వకీల్ సాబ్ " మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రజనీకాంత్ కు ప్రధాని మోడీ బర్త్ డే విషెస్

బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న "అపూర్వ రాగంగళ్" తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రజనీకాంత్ , కొన్ని సినిమాలలో నెగటివ్ క్యారెక్టర్స్ లో నటించినా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని తిరుగు లేని హీరోగా మారారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పద్మ భూషణ్ , పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

నారప్ప నుండి రానున్న గ్లిమ్స్

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలాక్ డౌన్‌కి ముందే 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్‌గానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ పునఃప్రారంభించగా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4- మోనాల్ కోసం త్యాగం చేసిన హారిక

బిగ్ బాస్ 4 - టికెట్ టు ఫినాలే ని కూడా చాలా ఈజీగా తేల్చేసిన బిగ్ బాస్ ఈ వారం మాత్రం రోజుకో కొత్త టాస్క్ తో వచ్చి హౌస్ మేట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులకు తెలిసే ప్రయత్నం చేసాడు. ఇక నాలుగు రోజుల నుండి మూడు టాస్క్ లతో వచ్చిన బిగ్ బాస్ ఈరోజు మరో టాస్క్ తో వచ్చేశాడు. మరి చూద్దాం బిగ్ బాస్ ఈ రోజు ఏం టాస్క్ ఇచ్చాడు.. ఎవరు గెలిచారు అన్నది తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం

సక్సెస్ ఫుల్ "అప్పట్లో ఒకడుండేవాడు " మూవీ తో శ్రీవిష్ణు టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న శ్రీవిష్ణు "మెంటల్ మదిలో", "నీదీ నాదీ ఒకే కథ ", "బ్రోచేవారెవరురా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "రాజా రాజా చోర ", "గాలి సంపత్ " మూవీస్ లో నటిస్తున్న శ్రీవిష్ణు హీరోగా మరో మూవీ ప్రారంభం అయ్యింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బావ, చెల్లికి వరుణ్ బెస్ట్ విషెస్

మెగా వారసురాలు నిహారిక పెళ్లి వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుండి టాలీవుడ్ లో ఎక్కడ విన్నా నీహారిక పెళ్లి కబుర్లేవినిపించాయి. మెగా పరివారమంతా రాజస్థాన్ ఉదయ పూర్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిజానికి పవన్ రాకపోతే ఆ వెలితి ఉండేది.. అయితే పవన్ కూడా ఈ పెళ్ళికి హాజరవడంతో ఇంకా నిండుతనం వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి పెళ్లి అయిపోవడంతో అందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి పయనమయ్యారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మడోన్నా సెబాస్టియన్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ

నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న "శ్యామ్ సింగ రాయ్ "మూవీ నిన్న పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని తండ్రి క్లాప్ కొట్టగా , దర్శకుడు మేర్లపాక గాంధీ స్విచ్చాన్ చేశారు. ఈ సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. "శ్యామ్ సింగ రాయ్ "మూవీలో ముగ్గురు కథానాయికలలో సాయి పల్లవి , కృతి శెట్టి ఎంపిక అయిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4.. సోహెల్-అరియానా పంచాయితీ

బిగ్ బాస్ 4 - మొన్న సోహెల్-అరియానా మధ్య పెద్ద గొడవ వల్ల హౌస్ మొత్తం ఫుల్ హీట్ లో ఉండగా.. నిన్నటి ఎపిసోడ్ తో కాస్త కూల్ అయినట్టు వున్నారు హౌస్ మేట్స్. మరి నిన్నటి ఎపిసోడ్ లో ఎం జరిగిందో ఒక లుక్కేద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరోయిన్ హన్సిక న్యూ లుక్

పలు బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక సూపర్ హిట్ "ఆప్ కా సురూర్ " మూవీ తో కథానాయికగా మారారు. బ్లాక్ బస్టర్ "దేశముదురు "మూవీ తో టాలీవుడ్ కు హన్సిక పరిచయం అయ్యారు. "కంత్రి" , "కందిరీగ ", పాండవులు పాండవులు తుమ్మెద ", "దేనికైనా రెడీ ", పవర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో హన్సిక ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "మాప్పిళ్ళై " మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించి హన్సిక అక్కడ బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"సలార్" మూవీ హీరోయిన్ దిశా పటాని ?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "లోఫర్ " మూవీ తో దిశా పటాని కెరీర్ ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ "ఎమ్ ఎస్ ధోని -ది అన్ టోల్డ్ స్టోరీ " మూవీ తో బాలీవుడ్ లో దిశాపటాని అడుగుపెట్టారు. దిశా పటాని కథానాయిక గా నటించిన "బాఘీ 2", "భారత్ ", "మలంగ్ "హిందీ మూవీస్ ఘనవిజయం సాధించాయి. దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న "రాధే " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"#NS22" షూటింగ్ గ్లింప్స్

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం 3 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " , లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "వరుడు కావలెను ", అనీష్ కృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "#NS22"మూవీస్ షూటింగ్స్ లో నాగశౌర్య పాల్గొంటున్నారు. విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య "మూవీ లో పాత్రకై హీరో నాగశౌర్య 8ప్యాక్ అబ్స్ ను సాధించారు. "లక్ష్య " మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"సలార్" మూవీ ఆడిషన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "రాధేశ్యామ్ " మూవీ తరువాత ప్రభాస్ "ఆదిపురుష్ ", నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్ "మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్

షేర్