బిగ్ బాస్ 4- మోనాల్ కోసం త్యాగం చేసిన హారిక

Bigg Boss Telugu 4 Day 96 Highlights: Harika Sacrifices Her Victory To Monal,Bigg Boss 4 Telugu - Day 96 Highlights: Houseguests Engage In Dance Task And Monal Wins The Golden Mic,Bigg Boss 4 Telugu - Day 96 Highlights: Ariyana Wins Vote To Appeal Task and Akhil-Monal Argue,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Bigg Boss 4 Telugu,Bigg Boss 4 Telugu Latest News,Bigg Boss Telugu 4 Day 96 Highlights,Bigg Boss Telugu 4 Updates,Bigg Boss Telugu 4 Season Day 96 Highlights,Akhil,Monal

బిగ్ బాస్ 4 – టికెట్ టు ఫినాలే ని కూడా చాలా ఈజీగా తేల్చేసిన బిగ్ బాస్ ఈ వారం మాత్రం రోజుకో కొత్త టాస్క్ తో వచ్చి హౌస్ మేట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులకు తెలిసే ప్రయత్నం చేసాడు. ఇక నాలుగు రోజుల నుండి మూడు టాస్క్ లతో వచ్చిన బిగ్ బాస్ ఈరోజు మరో టాస్క్ తో వచ్చేశాడు. మరి చూద్దాం బిగ్ బాస్ ఈ రోజు ఏం టాస్క్ ఇచ్చాడు.. ఎవరు గెలిచారు అన్నది తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అవినాష్ వెళ్లేప్పుడు నాకంటే అఖిలే పులిహార రాజా అని చెప్పింది నిజం చేస్తున్నాడు. మోనాల్‌ తో గొడవ పడిన అఖిల్ ఆమె ముందే హారికను ఫ్లర్ట్‌ చేస్తున్నాడు. హారిక ఏదో పనిచేసుకుంటూ కిచెన్‌లో ఉండగా.. అఖిల్ మెల్లగా ఆమె దగ్గరకు వెళతాడు. సొహైల్ చూసి.. ఏంటి ఆమె దగ్గరకు పోతున్నావ్ అని అనడంతో హారికను ఏం షాంపూ ఇది.. మా దగ్గర లేదే నీ దగ్గరకు ఎలా వచ్చింది? అని అడుగగా.. వాష్ రూమ్ లో ఉంటుంది అంటూ హారిక కామెడీ చేస్తుంది. అఖిల్‌ అక్కడితో ఆగకుండామరింత పాట పాడుతూ.. పక్కనే ఉన్న మోనాల్‌ను ఏడిపించే ప్రయత్నం చేశాడు. అయితే మోనాల్‌ మాత్రం పట్టించుకోనట్లు వెళ్ళిపోతుంది. మరోవైపు సోహైల్‌.. పులిహోర కలపడంలో నువ్వే తోపువంటూ అఖిల్‌పై పంచ్‌ వేశాడు.

ఇక ఇప్పటికే మూడు రకాల టాస్క్‌లు ఇచ్చిన బిగ్‌బాస్‌.. నాల్లో టాస్క్‌గా వినోదాన్ని అందించే చాన్స్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా తక్కువ సైజు షూ ధరించి స్టేజ్ పై డ్యాన్స్‌ చేయాలి. ఆ సమయంలో ఎవరూ కూడా స్జేజీపై కూర్చోవడం కానీ, నిలబడటం కానీ చేయకూడదు. అలాగే మధ్య మధ్య మ్యూజిక్‌ ఆపేస్తానని.. అప్పుడు ఒకరు కిందకు దిగాలని కండీషన్‌ పెట్టాడు. అయితే ఎవర దిగిపోతారో ఇంటి సభ్యల ఇష్టమని చెప్పాడు. ఈ టాస్క్‌కు అఖిల్‌ని సంచాలకుడిగా నియమించాడు. కిందికి ఎవరిని దించాలో అఖిల్‌ కూడా సూచించవచ్చని బిగ్‌బాస్‌ చెప్పాడు. చివరి వరకు స్టేజీపై ఎవరు ఉంటారో వారికి గోల్డెన్‌ మైక్‌ లభిస్తుందని చెప్పాడు.

ఇక టాస్క్ బజర్ మోగగానే ఇంటి సభ్యులంతా తక్కువ సైజ్‌ గల షూ ధరించి డ్యాన్స్‌ చేశారు. మొదటి సారి మ్యూజిక్‌ ఆపేయగా.. ఇప్పటీకే రెండు సార్లు అరియానా కు రెండు ఛాన్స్ లు రావడంతో అఖిల్‌ తో పాటు మిగతా ఇంటి సభ్యులంతా అరియానాను దిగాల్సిందిగా కోరారు. అయితే అక్కడ కొంచం సేపు అర్గ్యూ జరిగింది. తాను దిగేందుకు సిద్దంగా ఉన్నానంటునే ఇప్పుడు మాత్రం దిగనని, రెండోసారి దిగుతానని చెప్పుకొచ్చింది. అలా చాలా సేపు వాదన జరగగా.. ఈ గ్యాప్ లో అభి కూర్చుంటాడు. అయితే కూర్చోకూడదన్న రూల్ ఉండటంతో అభి దిగిపోయాడు. ఇక రెండో సారి మ్యూజిక్‌ ఆగినప్పుడు అరియానా, మూడో సారి సోహైల్ దిగిపోయారు. ఫైనల్ గా హారిక,మోనాల్ మిగలగా ఎలాగూ మోనాల్ తనకు కెప్టెన్సీ టాస్క్ కు సాయం చేయడంతో హారిక ఈ అవకాశం మోనాల్ కు ఇచ్చింది. ఇక టాస్క్‌ గెలిచి గొల్డెన్‌ మైక్‌ సాధించిన మోనాల్‌.. కన్ఫెషన్‌ రూమ్‌కి వెళ్లి ఓట్లు వేయమని ప్రేక్షకులను రిక్వెస్ట్‌ చేసింది.

ఇక ఈరోజు ఈవీకెండ్.. మరి అసలే ఈవారం హౌస్ లో పెద్ద రచ్చనే జరిగింది. దానికి రేపు నాగార్జున ఏం చెపుతారో.. ఎవరికి క్లాస్ పీకుతాడో మాత్రం చూడాలంటే ఈరోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =